గుత్తుల సాయి అధ్యక్షతనజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం

July 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 29 ముమ్మిడివరం : ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం ముమ్మిడివరం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు సుంకర పావని, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఇద్దరూ సమన్వయంతో సభ్యుల సూచనలతో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ పార్టీకి ఉన్న ప్రత్యేకత ఏ పార్టీకీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వంలో సంక్షేమం కనిపించలేదని అన్నారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ జరుగుతున్నాయని చెప్పారు. యువ నాయకులు లోకేష్, ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ కూటమిని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు.జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ఈ క్రింది తీర్మానాలు చేశారు.రైతులకు డిఏపి పరిమితి పెంపు:ఎపిఐఎంఎస్ యాప్ ద్వారా అందిస్తున్న డిఏపి పరిమితిని రెండు బస్తాలకు పెంచి నిబంధనలు లేకుండా ఇవ్వాలని, ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్న కూరగాయల రైతుల సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు.పార్టీ సమావేశాల్లో ప్రాధాన్యత:
జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులకు నియోజకవర్గ, మండల పార్టీ సమావేశాలలో ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రోటోకాల్ పాటించాలని నియోజకవర్గ సభ్యులకు తెలియజేయాలని తీర్మానించారు.కార్యకర్తలకు రుణాలు:ఎస్ ఐ ఆర్ కార్యక్రమం, ఇంటింటి కార్యక్రమం చేస్తున్న అంకితభావంతో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలకు బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని గుత్తుల సాయి అన్నారు.

    ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహ రావు, దొమ్మేటి రమణ కుమార్, కట్ట సత్తిబాబు, దేవు శ్రీను, జిల్లా అధికార ప్రతినిధి సాక సీతా దేవి, గుబ్బల నాగేశ్వరరావు, మల్లాడి వెంకటరమణ, దేవు వెంకటరాజు, చిర్రా సురేష్, ఏళ్ల ఉదయ్, పులివెల ప్రకాష్, భీమవరపు శ్రీను, సత్తి నూకరాజు, నిమ్మకాయల సూరి నారాయణమూర్తి, చుట్టుగుళ్ల దుర్గావతి కిషోర్, గొల్లపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.

    🌐 Select Language:
    📰 ePaper