మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం
విద్యార్థులకు వ్యాసరచన పోటీల నిర్వహణ
జనం న్యూస్- జులై 29- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం పురస్కరించుకుని నాగార్జునసాగర్ రేంజ్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (ఎఫ్ డిఓ) సంగీత ఆదేశాల మేరకు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు బుధవారం నాడు నిర్వహించారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రకృతిలో జీవవైవిద్యాన్ని కాపాడడంలో పర్యావరణ సమతుల్యత ను నిలబెట్టడంలో పులులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు, అడవులను కాపాడుకుంటేనే పులులు సురక్షితంగా ఉంటాయని, విద్యార్థులు చిన్నతనం నుంచి వన్యప్రాణుల సంరక్షణ పై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు, అనంతరం విద్యార్థులకు పులుల సంరక్షణ మానవ మనుగడపై దాని ప్రభావం అనే అంశంపై ఫారెస్ట్ అధికారులు వ్యాసరచన పోటీలు నిర్వహించారు, అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు, ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రవీందర్ రెడ్డి, సంతోష్, రాములు, బీట్ ఆఫీసర్లు నవీన్, పాపారావు, గిరిబాబు, చంద్రకళ, తావునాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.