అమ్మ పేరిట ఒక మొక్క (మా కె నామ్ పర్ ఏక్ పేడ్)

July 29, 2026 | వైరల్ వార్తలు

72 మొక్కలను నాటిన మహాత్మ జ్యోతిబాపూలే ఎన్సిసి క్యాడేట్స్

జనం న్యూస్- జులై 29- నాగార్జునసాగర్ టౌన్-పర్యావరణ పరిరక్షణతో పాటు అమ్మపై ఉన్న ప్రేమను చాటుకునే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మా కె నామ్ పర్ ఏక్ పేడ్ (అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ (ఏఎన్ఓ) వెంకటేష్, కేర్ టేకర్ ఆఫీసర్ (సిటిఓ) గణేష్ ఆధ్వర్యంలో ట్రూప్ 1 & ట్రూప్ 2 ఎన్సిసి క్యాడేట్స్ 72 మొక్కలను నాటారు, ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రవికుమార్ మాట్లాడుతూ తల్లికి గౌరవం పర్యావరణానికి రక్షణ ప్రతి ఒక్కరూ తమ తల్లి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటాలని పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు, ఎన్సిసి అధికారులు మాట్లాడుతూ కేవలం మొక్కలు నాటడమే కాకుండా అవి వృక్షాలుగా మారేంతవరకు క్రమం తప్పకుండా నీరు పోస్తూ సంరక్షించాలని కోరారు, విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ- పచ్చదనం ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో ఎన్సిసి క్యారెట్ లు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper