మల్కంచెరువు, సిటీ వైన్స్ వాటర్‌లాగింగ్ ప్రాంతాలు, సీఓడీ పైప్‌లైన్ పనులను పరిశీలించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్

July 29, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, సూచించారు.ఈ సందర్భంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కంచెరువు వాటర్‌లాగింగ్ పాయింట్, సిటీ వైన్స్ వాటర్‌లాగింగ్ ప్రాంతాన్ని, అలాగే మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ పైప్‌లైన్ పనుల పురోగతిని సీపీ సంబంధిత సివిక్ బాడీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.వాటర్‌లాగింగ్ సమస్యకు కారణమవుతున్న అంశాలను అధికారులు వివరించగా, వర్షపు నీరు వేగంగా వెళ్లేలా అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని సీపీ సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించడం, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.అలాగే సీఓడీ పైప్‌లైన్ పనులను వేగవంతం చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనుల జరుగుతున్న ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు, అవసరమైన ట్రాఫిక్ మళ్లింపులపై ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, తో పాటు సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), సన్ ప్రీత్ సింగ్, సీఎంసీ కమిషనర్ సృజన, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, మాధాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం సి డిప్యూటీ కమిషనర్, ఏఈ ఏఈఈ అధికారులు, హైడ్రా సిబ్బంది, ఇతర సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

🌐 Select Language:
📰 ePaper