ఆకస్మికంగా కన్నుమూసిన కవి శ్రీచరణ్ సాయిదాసు.

July 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ :29జూలై బుధవారం : సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: సిద్దిపేటకు చెందిన కవి వేముల శ్రీచరణ్ సాయిదాసు ఆకస్మిక మరణం పట్ల సిద్దిపేటకు చెందిన కవులు సంతాపం తెలిపారు. మణిపూసలు కవితలు పద్యాలు ఇలా అనేక ప్రక్రియల్లో రచనలు చేయడమే కాకుండా పూర్వకవులు వేమన, పోతన, సోమన ప్రాంతాలకు వెళ్లి కార్యక్రమాలు చేసిన సాయిచరణ్ మరణం తీరని లోటని అన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు గలిగిన శ్రీ చరణ్ సాయిదాస్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సిద్దిపేట కవులు ఐతా చంద్రయ్య, ఎన్నవెళ్ళి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, మిట్టపల్లి పరశురాములు, బస్వ రాజ్ కుమార్, శ్రీనివాస్, కాల్వ రాజయ్య తదితరులు సంతాపం తెలిపారు…హెడ్లైన్స్

🌐 Select Language:
📰 ePaper