రా కదిలి రా ఉమ్మడి రాజోలి నేతన్న చేనేత గ్రామసభల్లో అక్రమాల గురించి నిలదీయడానికి రా

జనం న్యూస్ 30 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : 25 ఏళ్ల అక్రమ పాలన – రాజోలి చేనేత సంఘం పై దోపిడీ అమాయక నేతన్నల కష్టాన్ని దోచుకున్నారా జైనేతన్న జైఉమ్మడి_రాజోలిగత 25 ఏళ్ల నుండి జరుగుతున్న అక్రమ తంతుగత 25 ఏళ్ల నుండి ఇదే తంతు. పాలించిన పాలకులు ఎవరూ తక్కువ కాదు. అప్పట్లో వేసిన అక్రమ బాటలే ఇప్పటివరకు ఈ సంఘంలో భాగస్వాములైన అమాయక నిరుపేద చేనేత కార్మికుల బ్రతుకులపై ఎంతో ప్రభావం చూపించింది. నేం తక్కువ అన్నట్టుగా ప్రతి పాలకుడు అక్రమ పరిపాలన చేశాడు.కుటుంబాలకు సన్నిహితులకు మాత్రమే లాభంకొంతమంది పాలకులు సుదిమెత్తని పాలన పేరుత వారి కుటుంబాలకు అనుకూల మనుషులకు వడ్డీ లేని రుణాలు ఇప్పించారు. సంఘానికి సంబంధించిన మిగులు స్థలాలు ఖాళీ ప్లాట్లను 630 మంది షేర్ హోల్డర్ల ముందు ఎలాంటి చర్చ లేకుండా దోచుకున్నారు కొంచెం కొంచెం చేనును కంచి వేసినట్టు కార్మికుల కష్టాన్ని కొల్లగొట్టారు.రాజకీయ పలుకుబడి రహస్య లావాదేవీలు సంఘంలో రాజకీయ పలుకుబడి ఉండే వారికి మాత్రమే భాగస్వామ్యం.చేనేత కార్మికులకు చెప్పకుండా లోపల ప్లాట్లు ఇవ్వడం వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, కంటికి రెప్పలా అధ్యక్షులు చూసుకోవడం ఇవన్నీ సంఘంలోని కార్మికులకు తెలుసు.అయినా కులం మతం అనే ఆలోచనతో నిలదీయలేక కాముష్ గా ఉండిపోయారు.2009 వరదల్లో జరిగిన ఘోర దోపిడీ 2009 అక్టోబర్ 2 వరదల్లో గ్రామం మొత్తం నష్టంలో కూరుకుపోయింది.ప్రభుత్వం ఒక్కో మగ్గానికి ₹5,000 ఇవ్వడానికి వస్తే సంఘంలోని కొంతమంది పాలకులు అధికారులతో కలిసి కార్మికుల ఇండ్లకు వెళ్లి నీకు సగం, నాకు సగం అన్నారు.ఇతర వృత్తుల వారి పేర్లు కూడా రాయించి డబ్బు తీసుకున్నారు. సూటి ప్రశ్న: ఇది నిజమా కాదా మీ మనస్సాక్షి మీద చేయి వేసి చెప్పగలరా వరద తర్వాత కూడా దొంగ లెక్కలు చూపి, నామకేవాస్తే కొంత చేసి చేతులు దులుపుకున్నారు.ఖాళీ స్థలాల పట్టాలు – స్వార్థ రాజకీయం ఇదే మంచి అవకాశం అని కొంతమంది పాలకవర్గ సభ్యులు నిరుపేద కార్మికుల ఖాళీ స్థలాలను పట్టాలుగా మార్చుకొని వారి పేర్ల మీద ఎక్కించుకున్నారు. ఇండిపెండెంట్ గా గెలిచిన వారు కూడా ఒక చెయ్యి పాలకవర్గానికి, మరో ఒక చెయ్యి ప్రకృతి వర్గం తల మీద వేస్తూ రాజోలి చేనేత నిరుపేదల ఆస్తులను దోచుకుని తినే విధంగా నిరుపేద చేనేత కార్మికులకు ఇచ్చే ప్లాట్లు తమ పేర్ల మీద వాయించుకోలేదా ఇది అబద్దమా నిజమా చేనేత గ్రామసభలో నేర్పించుకోండి ఎవరు ఎంతవరకు చేశారు ఎవరి పొట్టకూటిని కొట్టారు ఇది గ్రామంలో ప్రతి చేనేత కార్మికుడికి తెలుసు.కానీ మౌనం కులం మతం అడ్డు రావడంతో కళ్లల్లో కన్నీళ్లతో ఉండిపోయారు.నిజమైన నాయకుడు ఎవరు ఒకటే తెలుసు గతంలో పెద్దాయన చిలక టోపీ నాగేంద్రప్ప చేసిన అభివృద్ధి వల్లనే ఈ సంఘం ఇప్పటివరకు నిలిచింది. ఇది నా మాట కాదు ఇది చేనేత కార్మికుల మాట మా డిమాండ్: వెంటనే గ్రామసభ పెట్టండి 25 ఏళ్లలో జరిగిన పరిపాలన, ఆస్తులు డబ్బు ఖాళీ ప్లాట్లు ఎవరికి ఇచ్చారు? ఎవరు లాభపడ్డారు అనే విషయాన్ని
ఇప్పుడున్న పాలకవర్గం మొత్తం బహిరంగంగా ప్రజల ముందు ఉంచాలి రాజోలి గ్రామ చేనేత కార్మికుల గ్రామసభ ను వెంటనే పెట్టి గతంలో పాలించిన ప్రతి సభ్యుడు హాజరై వివరణ ఇవ్వాలి. ముఖ్య గమనిక గత పాలకులు ఈ చేనేత గ్రామసభకు కచ్చితంగా హాజరు కావాలి ఏదైనా వంకతో రాకపోతే సమాచార హక్కు చట్టం కింద అన్ని వివరాలు సేకరించి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము.ఇది గత 25 ఏళ్లుగా పాలించిన ప్రతి సభ్యుడికి ప్రేమతో గౌరవంతో ఇచ్చే చివరి హెచ్చరిక పైన కనబరిచిన విషయాలు నిజమా అబద్దమా నిర్పించుకోవడానికి గతంలో పాలించిన సభ్యులు రావడానికి వారికి కొత్తగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు ప్రత్యేక ఆహ్వానం ఇస్తూ మంచి ముహూర్తం చూసి ఏదో ఒక రోజు నిర్ణయించి తేదీని త్వరగా ప్రకటించాలని ఆశిస్తున్నాము. మీడియా మిత్రులకు విజ్ఞప్తిఈ అక్రమాలపై గౌరవ మీడియా పత్రిక మిత్రులు సోషల్ మీడియా సోదర సోదరీమణులు చేనేత కార్మికులకు అండగా నిలవాలని కోరుతున్నాము.అందరూ బాగుండాలి అందులో మనమంతా ఉండాలి జై నేతన్న జై జై ఉమ్మడి రాజోలి