విద్యార్థి మరణానికి కారణమైన లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకోని, విధులనుంచి తొలగించాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బి ఆంజనేయులు డిమాండ్

జనం న్యూస్ 30 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం, విద్యాశాఖ నుంచి తక్షణమే అన్నిరకాల పరిహారం చెల్లించాలి ఈ సంఘటనపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ కు ధన్యవాదములు అధ్యాపకులు విద్యార్థులను ద్వేషించడం కొట్టడం అమానుషం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న తరుణ్ అనే విద్యార్తిపై శిరీష అనే లెక్చరర్ చెంప దెబ్బ కొట్టి అవమానించిన సంఘటనలతో కలత చెంది మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్ల అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎ ఐ యస్ యాప్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సి పి ఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు దిగ్బాంతిని వ్యక్తం చేస్తూ దీనిని తీవ్రంగా ఆక్షేపించారు. లెక్చరర్లు విద్యార్థుల్ని ప్రేమించాలే గాని వారి పట్ల అవమానకరంగా దురుద్దేశం పూర్వకంగా తోటి విద్యార్థుల ముందు హేళన చేయడం అధ్యాపకుల యొక్క విధానం కాదని ఇలాంటి అధ్యాపకుల పట్ల విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు శాఖపరమైన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులలో ఒత్తిడిని తట్టుకునే విధంగా మానసిక స్థైరాన్ని మనోధైర్యాన్ని నెలకొల్పే విధంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ అవగాహన కార్యక్రమాలు రూపొందించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన కొత్తపల్లి గ్రామం గద్వాల మండలం ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ బైపిసి చదువుతున్న తరుణ్ ఆత్మహత్యకు సంబంధించిన సంఘటన పట్ల ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారులు తక్షణమే సీరియస్ గా విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి మరణానికి కారణమైన అధ్యాపకురాలైన శిరీషను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని, మరణించిన కుటుంబానికి ప్రభుత్వం నుంచి అలాగే అధ్యాపకురాలు నుంచి ఆర్థిక సాయం ఇతర తోడ్పాటులను తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.