శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా యువజన ఉత్సవాలు

జనం న్యూస్ జూలై 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ; భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ కాకినాడ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో యువజన ఉత్సవాలు ఘనంగా జరిగాయి.28 జూలై 2026 మంగళవారం జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖనం, మైమ్, నృత్యం, గానం, వ్యాసరచన, నినాదాల రచన, నాటికల పోటీలు నిర్వహించారు. “నశాముక్త యువత ఫర్ వికసిత్ భారత్” అనే అంశాలపై విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మై భారత్ జిల్లా యువజన అధికారి టి గోపి మాట్లాడుతూ మై భారత్ వేదిక ద్వారా యువతకు తమ ప్రతిభను చూపించే అవకాశం లభిస్తుందని అన్నారు. 300 మంది విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చి కళలను ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. అవకాశం కల్పించిన కళాశాల సంచాలకులు డాక్టర్ నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు.ముఖ్య అతిథిగా అమలాపురం డి.ఎస్.పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ వికసిత భారత నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడమే మై భారత్ లక్ష్యమని అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. విజేతలను అభినందించారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యా విభాగం బి రత్నం రాజు మాట్లాడుతూ శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతో పాటు సాంస్కృతిక, సామాజిక బాధ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తూ వికసిత్ భారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నామని చెప్పారు. జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను కళాశాలలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.ఈగల్ బృందం సి ఐ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ దుర్వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.తదుపరి యువజనోత్సవాల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు బి రత్నం రాజు, ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారులు వెంకట్, అలీ, మై భారత్ సభ్యులు సరోజిని, అనూష, ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.