విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి: శ్రీ చైతన్య స్కూల్ దిల్‌సుఖ్‌నగర్ జోన్ ఏజీఎం వెంకట్ రెడ్డి

July 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; విద్యార్థులు విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు, విలువలను పెంపొందించుకుని సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని శ్రీ చైతన్య స్కూల్ దిల్‌సుఖ్‌నగర్ జోన్ ఏజీఎం వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. హయత్‌నగర్ పరిధిలోని సాయినగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్‌లో గురువారం నిర్వహించిన స్టూడెంట్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హెడ్ బాయ్, హెడ్ గర్ల్, వైస్ కెప్టెన్లు, హౌస్ కెప్టెన్లు సహా వివిధ బాధ్యతలకు ఎంపికైన విద్యార్థులు తమ పదవులను స్వీకరించి, నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో విధులు నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏజీఎం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువులోనే కాకుండా నాయకత్వ నైపుణ్యాలు, నైతిక విలువలు కూడా అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంజనీ దేవి మాట్లాడుతూ, నాయకత్వం అనేది కేవలం హోదా కాదని, అది ఒక బాధ్యత అని విద్యార్థులు గుర్తుంచుకోవాలని చెప్పారు. క్రమశిక్షణ, సమయపాలన, సేవా దృక్పథంతో ముందుండి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రఘువంశీ, పీఈటీ అనిల్, జోనల్ ఇన్‌చార్జి పీఈటీ అయోధ్య, డీన్ రఘుపతి, సి బ్యాచ్ ఇన్‌చార్జి సోమయ్య, ఏవో ప్రమోద్ గౌడ్,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper