రాజాంలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు
జనం న్యూస్ జూలై 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజాం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఆదర్శ నగర్, అమ్మవారి కాలనీలో ఈరోజు నిర్వహించిన ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, రాజాం శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.అనంతరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి కార్యక్రమంలో భాగంగా 17వ వార్డులోని వివిధ ఇళ్లను సందర్శించారు. ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చే దిశగా నిరంతరం పనిచేస్తోందని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల విశ్వాసమే మా బలమని, అదే విశ్వాసంతో మరింత అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.ఈ నెల 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగబోయే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు