ఏర్గట్లగ్రామపంచాయతీ సిబ్బందికి వానకోట్ల పంపిణీ చేసిన సర్పంచ్ ఉపేంద్ర రెడ్డి
జనం న్యూస్ జూలై 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లగ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గురువారం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వానకోట్లను పంపిణీ చేశారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా విధులు నిర్వర్తిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. వారికి అవసరమైన రక్షణ సామగ్రిని అందించడం గ్రామపంచాయతీ బాధ్యత అని అన్నారు.గ్రామపంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ, సిబ్బంది తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలను దశలవారీగా కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.