ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.
జనం న్యూస్ జులై 31 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా గురువారం బీబీపేట మండల కేంద్రంలోని గ్రామ సంగం సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వై.ఆర్.జి కేర్ లింకు వర్కర్ స్కీం ఉమ్మడి జిల్లా డీ. ఆర్.పి. గర్దాసు సుధాకర్, తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున వివిధ రకాల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి దోమతెరలను వాడాలని తెలిపారు. చర్మవ్యాధులు, సుఖ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఆయా వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో క్లస్టర్ లింకు వర్కర్ బాలకిషన్, గ్రామ సంఘాల ప్రతినిధులు, వివో ఏలు పాల్గొన్నారు.