రాపోలు గ్రామంలో ఘనంగా హరితహారం కార్యక్రమం

July 31, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 31 జులై వికారాబాద్ జిల్లా :- పరిగి మండలం రాపోలు గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు. ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేస్తూ, మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ ఇళ్ల పరిసరాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాపోలు గ్రామ ఉపసర్పంచ్ సిహెచ్. శ్రీశైలం, రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండు వెంకటేష్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి. అనంతయ్య, ఇబ్రహీం, నర్సింలు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper