భోగాపురం కార్యక్రమంపై ప్రభుత్వ విప్ సహా మంత్రుల సమీక్ష
జనం న్యూస్ జూలై 31 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రేపు ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతానికి విమానాశ్రయం అడ్మిన్ బ్లాక్‌లో కీలక సమీక్ష జరిగింది.ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, మంత్రులు అనగాని సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ చింతకాయల విజయ్, పార్టీ రాష్ట్ర నాయకుడు కిలారి రాజేష్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ప్రధాని పర్యటనకు సంబంధించి సభా నిర్వహణ, భద్రత, ప్రజల రాకపోకలు, పార్కింగ్, తాగునీరు, భోజనం, ఇతర సౌకర్యాలపై సమగ్రంగా చర్చించారు. ప్రతి ఏర్పాటు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.