సర్వీస్ అయినా బ్రిడ్జిలపై నుండి వెళ్లే ప్రజలకు ప్రాణాలకు నష్టం ప్రభుత్వం వెంటనే బిడ్జీలను నిర్మించాలి
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం ఆగస్టు 01. 08 2026 జహీరాబాద్ నియోజకవర్గంలో సర్వీస్ కాలం పూర్తయిన, శిథిలావస్థకు చేరుకున్న పాత బ్రిడ్జిలను ప్రభుత్వం వెంటనే తొలగించి వాటి స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మించాలని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత బ్రిడ్జిలపై నిత్యం వాహనాలు, ప్రజలు ప్రయాణించడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయాందోళన నెలకొందని ఆయన అన్నారు. భారీ వర్షాల సమయంలో ఈ బ్రిడ్జిల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే వరకు వేచి చూడకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి పాత బ్రిడ్జిలను తొలగించి ఆధునిక ప్రమాణాలతో కొత్త బ్రిడ్జిల నిర్మాణ పనులను ప్రారంభించాలని చిట్టెంపల్లి బాలరాజ్ కోరారు.