ఆప్యాయ వాతావరణంలో పౌర్ణిమ జన్మదిన వేడుకలు – శుభాకాంక్షలు తెలిపిన బండి రమేష్
జనం న్యూస్ ఆగస్టు 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తమ కార్యాలయ సిబ్బందిలోని పౌర్ణిమ జన్మదిన సందర్భంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, పౌర్ణిమ ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం, విజయాలతో నిండిన సుఖసంతోషాల జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఆమె కోరుకున్న ప్రతి లక్ష్యం నెరవేరి, జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థించారు.అనంతరం పౌర్ణిమ బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బండి రమేష్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, మిఠాయిలు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, రామారావు, రమణ, కామినేని వాసు, అస్లాం, శ్రీనివాస్, మహేష్, నాగార్జున, అరుణ్, బాలరాజు, సృజన్, పర్వేట్, సంధ్య, రమాదేవి,జ్యోతి తదితరులు పాల్గొని పౌర్ణిమకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.