కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమం

August 1, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం ఆగస్ట. 01. 08. 2026 జహీరాబాద్: ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలో “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేవైఎం కన్వీనర్ సోమ అనిల్, కో-కన్వీనర్ నరేష్ పాటిల్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల అధ్యక్షుడు నర్సింలు, ఉపాధ్యక్షులు రాజు, సందీప్ తదితర బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper