కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం శ్రీ ముత్తు మారమ్మ. ఈనెల 9న జాతర

August 1, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరుమండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ అరవపల్లి గ్రామంలోవెలసిన శ్రీ ముత్తు మారమ్మ తల్లి భక్తులు కోరిన కోర్కెలుతీర్చేకొంగుబంగారంగా వెలసి ఉన్నది. మండల వాసులు గ్రామ దేవతగా పూజించే శ్రీ ముత్తు మారమ్మ ను ఏదైనా శుభకార్యాలకు, ఆ దారిన వెళ్లే భక్తులు ఆమెను దర్శించుకుని వెళితేశుభాలుజరుగుతాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. వందల సంవత్సరాల క్రితం తమిళనాడు నుండి వలస వచ్చిన మొదలియార్ కుటుంబ సభ్యులు ఈ దేవతను అరవపల్లి లో ప్రతిష్టించడం జరిగింది. దీంతో మహిమాన్వితమైన ఈ దేవత కు ప్రతి ఏటా ఆగస్టు మాసంలో జాతర మహోత్స వాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా మారింది అందులో భాగంగా ఈనెల 8న ఊరేగింపు. ఈ ఊరేగింపుకార్యక్రమంలో వివిధ రకాల వేషధారణ లు, కర్ర సాము ,కోలాటాలు మధ్య ఘనంగాగ్రామోత్సవం నిర్వహిస్తారు. 9వ తేదీన జాతర మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించి మొక్కులు చెల్లిస్తారు. 10 వ తేదీన పాలపూజ కార్య క్రమంనిర్వహిస్తారు. ఈ జాతర మహోత్సవంలో స్థానికులే గాక ఇతర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు.

🌐 Select Language:
📰 ePaper