శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు, జర్నలిస్టు తెల్ల హరికృష్ణ

August 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ | ఆగస్టు 5 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డికూకట్‌పల్లి దయార్‌గూడ మెట్రో షాపింగ్ మాల్ ఎదుట ఉన్న శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవం అనంతరం మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు, సీనియర్ జర్నలిస్టు తెల్ల హరికృష్ణ ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ నిర్వాహకులను అభినందిస్తూ భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కూతురు బాబు, కొమ్ము బాబు, కూతురు సురేష్, సత్యనారాయణతో పాటు పలువురు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీ మధ్య కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా సాగింది.

🌐 Select Language:
📰 ePaper