అత్యవసర హెచ్చరిక: గ్రామ ప్రజలందరికీ గమనిక స్వీట్ టెంకర్ బోల్తా పడింది

August 4, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 04 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులమ్మ గద్వాల్ జిల్లా కేటు దొడ్డి మండలం మన నందిన్నె గ్రామం సమీపంలోని సంఘం బావి దగ్గర ఒక యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడింది. దీని కారణంగా ప్రమాదకరమైన యాసిడ్ గాల్లో వేగంగా వ్యాపిస్తోంది.ఈ గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కావున ప్రజల ప్రాణరక్షణ దృష్ట్యా కింది జాగ్రత్తలు తప్పక పాటించండి.దూరంగా ఉండండి: ప్రమాద స్థలానికి ఒక కిలోమీటర్ (1 కిలోమీటర్) పరిధిలోకి ఎవరూ వెళ్లకూడదు.సమయం: రాబోయే 3 గంటల వరకు ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ అస్సలు వెళ్లవద్దు.చుట్టుపక్కల ప్రజలు గమనించగలరు సురక్షితంగా ఉండండి.మాస్క్ ధరించండి: అత్యవసరమైతే ముక్కు నోటికి తడి గుడ్డ లేదా మాస్క్ అడ్డు పెట్టుకోండి.దయచేసి ఈ సమాచారాన్ని మన ఊరి గ్రూపులన్నింటికీ షేర్ చేసి, అందరినీ అప్రమత్తం చేయండి. ప్రాణనష్టం జరగకుండా కాపాడుకుందాం.గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు

🌐 Select Language:
📰 ePaper