జనన, మరణాల నమోదు వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే బిల్లుకు వైస్సార్సీపీ మద్దతు: రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ రెడ్డి

August 4, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు–2026పై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ మేడా రఘునాధ రెడ్డి మాట్లాడారు.దేశంలో జనన, మరణాల నమోదు వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.గత రెండు దశాబ్దాల్లో దేశంలో జనన, మరణాల నమోదు శాతం గణనీయంగా పెరిగిందని, రెండేళ్లకు మించిన ఆలస్య నమోదులకు న్యాయపరమైన పరిశీలన తప్పనిసరి చేయడం ద్వారా తప్పుడు నమోదులను నివారించవచ్చని పేర్కొన్నారు.జనన, మరణాల సమగ్ర డేటాబేస్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా సాగుతుందని, అర్హులకే ప్రయోజనాలు అందేలా వ్యవస్థ బలోపేతం అవుతుందని వివరించారు.*అయితే, రాష్ట్రాల మధ్య నమోదులో ఉన్న అసమాన తలు, గ్రామీణ ప్రాంతాలు, పేదలు, దినసరి కూలీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వంటి బలహీన వర్గాలకు నమోదులో ఎదురయ్యే ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.*కఠినమైన ధృవీకరణ విధానంతో పాటు ప్రజలకు సులభమైన నమోదు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సూచనలతో జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు–2026కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎంపీ మేడా రఘునాధ రెడ్డి తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper