మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

August 4, 2026 | తెలంగాణ

బిచ్కుంద ఆగస్టు 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదడిగి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ విఠల్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా విఠల్ రెడ్డి కి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన ఓదార్పు మాటలు చెప్పారు.ఈ పరామర్శ కార్యక్రమంలో బిచ్కుంద మండల BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper