లాడేగావ్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శ
జుక్కల్ ఆగస్టు 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లాడేగావ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్ శ్రీ రాజశేఖర్ పటేల్ గారు ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు.ఈ సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ రాజశేఖర్ పటేల్ నివాసానికి వెళ్లి, ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమం లో జుక్కల్ మండల BRS నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు