బిఎన్ఆర్ స్కూల్లో ఘనంగా బోనాల పండుగ
జనం న్యూస్ : ఆగస్టు 8, శనివారం: సిద్దిపేట జిల్లా బిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తెలంగాణ సంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పోతరాజుల వేషధారణలో, విద్యార్థినులు బోనాలు ఎత్తుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి లక్ష్మీనారాయణ శారద, ప్రిన్సిపాల్ పి. మౌనిక, వైస్ ప్రిన్సిపాల్ మల్లీశ్వరి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.