జర్నలిస్టుల హక్కుల కోసం జాతీయ స్థాయిలో మరో ఉద్యమానికి తెరలేపిన ఐ ఎఫ్ డబ్ల్యూ జె.*
జనం న్యూస్ 09 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సెప్టెంబర్ రెండో వారంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా భారీ ధర్నాకు కసరత్తు జర్నలిస్టుల సమస్యలపై జాతీయ నేతల జూమ్ సమావేశంలో కీలక చర్చలు.టిడబ్ల్యూజేఎఫ్ ఉద్యమ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో వేగం పెంచిన ఐ ఎఫ్ డబ్ల్యూ జే.జాతీయ నేతల సమావేశంలో పాల్గొన్న ఈడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య తెలంగాణ జర్నలిస్టుల సమస్యలను జాతీయ వేదికపై వినిపించిన టిడబ్ల్యూజేఎఫ్జర్నలిస్టుల కోసం హక్కుల కోసం టిడబ్ల్యూజేఎఫ్ పోరాటానికి జాతీయ నేతల ప్రశంసలు.రాంచీలో త్వరలో ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ సమావేశాలు భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలుతెలంగాణ నుంచి జాతీయ స్థాయికి టిడబ్ల్యూజేఎఫ్ గళం.. జర్నలిస్టు వర్గాల్లో హర్షం టిడబ్ల్యూజే నాయకత్వానికి అభినందనలు.. జాతీయ జర్నలిస్టు ఉద్యమంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు త్వరలో “ఛలో ఢిల్లీ”కి ఐఎఫ్ డబ్ల్యూ జె ప్లాన్ సెప్టెంబర్ రెండో వారంలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కసరత్తు..జర్నలిస్టుల హక్కులు సంక్షేమం, రక్షణ తదితర దేశవ్యాప్త సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే ) జాతీయ నాయకత్వం కార్యాచరణకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ రెండో వారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించే అంశంపై జాతీయ నాయకులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.జూమ్ సమావేశంలో కీలక చర్చలుదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత, సంక్షేమం తదితర అంశాలపై ఐ ఎఫ్ డబ్ల్యూ జే జాతీయ నాయకులు జూమ్ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూ జె ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కూడా పాల్గొని తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలు, టిడబ్ల్యూజేఎఫ్చేపట్టిన ఉద్యమ కార్యక్రమాల గురించి వివరించినట్లు సమాచారం.టిడబ్ల్యూజేఎఫ్ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కదలికతెలంగాణలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టిడబ్ల్యూజేఎఫ్ చేపడుతున్న కార్యక్రమాలు, ఉద్యమ పంథా జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేయాలనే దృక్పథం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చినట్లు సమాచారం.జర్నలిస్టుల కోసం.. జర్నలిస్టుల హక్కుల కోసం” అనే నినాదంతో టిడబ్ల్యూజేఎఫ్ చేస్తున్న కృషి ఇతర రాష్ట్రాల జర్నలిస్టు సంఘాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.జంతర్ మంతర్ వేదికగా మరోసారి విప్పనున్న గళం దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించే ప్రతిపాదనపై ఐ ఎఫ్ డబ్ల్యూ జే నాయకత్వం చర్చించినట్లు సమాచారం. సెప్టెంబర్ రెండో వారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దిశగా ప్రాథమిక కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.రాంచీలో ఐ ఎఫ్ డబ్ల్యూ జే జాతీయ సమావేశాలు.ఇదిలా ఉండగా జార్ఖండ్ రాజధాని రాంచీలో త్వరలో ఐ ఎఫ్ డబ్ల్యూ జే జాతీయ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి టిడబ్ల్యూజేఎఫ్ గొంతుక..తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కార్యకలాపాలు జాతీయ స్థాయిలో చర్చకు రావడం తెలంగాణ జర్నలిస్టులకు గర్వకారణమని పలువురు రాజకీయ పరిశీలకులు, సామాజికవేత్తలు, సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడుతున్నారు.జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించడం, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, జర్నలిస్టుల ఐక్యత కోసం కృషి చేయడం వంటి అంశాల్లో టిడబ్ల్యూజేఎఫ్ ప్రత్యేక గుర్తింపు సాధిస్తోందని వారు పేర్కొంటున్నారు.తెలంగాణ నుంచి వినిపిస్తున్న జర్నలిస్టుల గళం ఇప్పుడు జాతీయ వేదికపై కూడా ప్రతిధ్వనించే స్థాయికి చేరుకోవడం అభినందనీయమని పలువురు సీనియర్ పాత్రికేయులు టీ డబ్ల్యూ జె ఎఫ్ నాయకత్వాన్ని అభినందిస్తున్నారు.తెలంగాణ మోడల్ పై జాతీయ దృష్టిదేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాటానికి ఐ ఎఫ్ డబ్ల్యూ జె సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో టిడబ్ల్యూజేఎఫ్ చేపడుతున్న కార్యక్రమాలు జాతీయ నాయకత్వానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల హక్కుల కోసం తెలంగాణ నుంచి మరింత బలమైన స్వరం జాతీయ స్థాయిలో వినిపించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు