సిద్దేశ్వరాలయంలో ఘనంగా రుద్రాభిషేకం

May 18, 2026 | తెలంగాణ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, మే 18:జహీరాబాద్ పట్టణంలోని అల్గోల్ రోడ్డు లోని శ్రీ సిద్దేశ్వరాలయంలో పురుషోత్తమ మాసం సందర్భంగా సోమవారం నాడు స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సంగమేశ్వర స్వామి రుద్రాభిషేకం నిర్వహించారు. స్థానిక సాయిరెడ్డి గారి మాణిక్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులు అన్నదానం కార్యక్రమం జరిపారు. ఆలయంలో ప్రతి అమావాస్య తో పాటు ప్రతి సోమవారం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ, ఆలయ కార్యనిర్వహణ అధికారి శివరుద్రప్ప,శివశక్తి సంఘం బాధ్యులు సూదాం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper