ఆషాడ బోనాల పండుగ మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు : ప్రేమ కుమార్.
జనం న్యూస్ ఆగస్టు 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్ పల్లి శ్రీ శ్రీ శ్రీ మహంకాళి దేవస్థానం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎం.ఎల్.ఏ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఆషాడ బోనాల సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలొ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అమ్మవార్ల ఆశీర్వాదం పొందినారు. ఈ సందర్భంగా ప్రేమకుమార్ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు ప్రేమకుమార్ ని శాలువతో సత్కరించారు.ఈ ప్రత్యక పూజలలో జనసేన నాయకులు కాకుమాను లక్ష్మణ్ రావు,కొల్లా శంకర్, సిరిగినేని హరీష్, విష్ణు సాయి రణదీప్, ఆర్ . రాధిక తదితరులు పాల్గొన్నారు.