ప్రతిభ స్కూల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక.
జనం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గంఐ పోలవరం మండలం కేశనకురు ప్రతిభ ప్రైమరీ & హైస్కూల్ ప్రాంగణంలో ముందుగా కరస్పాండెంట్ ఎస్ వి ఎస్ ఎస్ ప్రకాష్ పతాకావిష్కరణ చేసి విద్యార్థినీ విద్యార్థుల చేత జనగణమన జాతీయగీతం పాడి జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ధర్మ ప్రచారక్ కనకారావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి అరాచకత్వాన్ని ఎదుర్కొని మానప్రాణాలను ఎదురొడ్డి స్వతంత్రాన్ని సాధించడానికి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఎందరో మహావీరులు ప్రాణాలను అర్పించి మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటుపడుతూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలన్నారు విద్యార్థులు కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరి ఎప్పుడూ దేశానికి సేవ చేయాలని సూచించారు విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారు దేశ నాయకుల వేషధారణలో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు వివిధ క్రీడా, వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన పిల్లలకు బహుమతులు అందించారు ఈ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసి ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్లో 468 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన శీలం కుసుమ ను యాజమాన్యం మరియు ప్రముఖులు అభినందించి బహుమతులు అందించారు.