అనకాపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుఎస్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ తుహిన్ సిన్హా

August 15, 2026 | ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత

జనం న్యూస్ ఆగస్టు 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం మరియు స్థానిక ఎన్టీఆర్ స్టేడియం పెరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా మరియు అత్యంత దేశభక్తి యుతంగా నిర్వహించబడ్డాయి.​ఎస్పీ క్యాంపు మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో పతాకా విష్కరణ ​ఉదయం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, మరియు వారి సతీమణి నిఖితా సెంగర్ (3వ అదనపు సివిల్ జడ్జ్ & 13వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, అనకాపల్లి) జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం సమర్పించారు. ​అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జాతీయ జెండాను ఎగురవేసి, పోలీస్ అధికారుల తో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. ​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ​”మనకు లభించిన స్వేచ్ఛ ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులను గుర్తు చేసుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరం పనిచేయాలి. సమాజంలో దేశభక్తి భావాన్ని పెంపొందించి, భావితరాలను ఆ దిశగా నడిపేందుకు సమిష్టిగా కృషి చేయాలి.”​అని పేర్కొంటూ జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఎన్టీఆర్ స్టేడియంలో ప్రధాన వేడుకలు –గౌరవ వందనం అనంతరం, అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ విజయ కృష్ణన్, ఐఏఎస్ ఆధ్వర్యంలో ప్రధాన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం జరిగింది.​ఈ వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెరేడ్ కమాండర్ ఏఆర్ ఎస్ఐ హరినాథ్ సారథ్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు నిర్వహించిన పెరేడ్ ను వీక్షించి, జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన హోంమంత్రితో పాటు అనకాపల్లి శాసన సభ్యులు కోణతాల రామకృష్ణ జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఐఏఎస్, ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, ఐఏఎస్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు వేదికపై గౌరవ వందనం చేశారు.ప్రత్యేక వాహనాల ప్రదర్శన –* ఆకట్టుకున్న శకటాలు ​వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక వాహనాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది:​వజ్ర వాహనం: శాంతిభద్రతల పరిరక్షణ మరియు మాబ్ కంట్రోల్ కోసం.
​అభయ వాహనం & శక్తి టీమ్‌లు: మహిళలు, బాలికల రక్షణ మరియు వారి హక్కులపై అవగాహన కల్పించే దిశగా నిర్వహించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.సాంస్కృతిక ప్రదర్శనలు: వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ సమైక్యతను ప్రతిబింబించాయి.ఉత్తమ సేవా పతకాలు మరియు ప్రశంసా పత్రాల ప్రదానం* ​పోలీసు శాఖలో విశిష్ట సేవలందించిన ప్రతిభావంతులకు హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీల సమక్షంలో పతకాలు ప్రదానం చేశారు.​2026 ఉగాది పురస్కారాలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకాలు, సేవా పతకాలు, అతి ఉత్కృష్ట మరియు ఉత్కృష్ట పతకాలను మొత్తం 24 మంది ప్రతిభావంతులకు అందజేశారు.ప్రశంసా పత్రాలు:విశేష ప్రతిభ కనబరిచిన 67 మంది జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బందికి హోంమంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.​​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, డీఎస్పీలు జీ.ఆర్.ఆర్.మోహన్,బి.మోహన్ రావు, ఇ.శ్రీనివాసులు, కె.రవికుమార్, ఇన్స్పెక్టర్లు బాల సూర్యరావు, లక్ష్మి, శ్రీనివాసరావు, వెంకటనారాయణ, ప్రేమ కుమార్, అశోక్ కుమార్, రమేష్, రమణయ్య, రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తితో పాటు ఇతర అధికారులు, సిబ్బంది మరియు పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు.//

🌐 Select Language:
📰 ePaper