ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్న జయ జయహే తెలంగాణ వందేమాతరం గీతాల నృత్య ప్రదర్శన

August 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : వేలాదిమంది చిన్నారుల నృత్య గీతాలాపనతో మారుమోగిన లలిత కళాతోరణం జయ జయహే తెలంగాణ, వందేమాతరం గీతాలాపనలు. వందలాది వీణలతో వీనుల విందైన సంగీతం అతిథులను ఆకట్టుకున్న చిన్నారుల పెయింటింగ్స్. ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం. తెలంగాణ కళా జాగృతి ఫౌండేషన్ మరియు సంగీతిక కళానిలయం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన తెలంగాణ తల్లికి వందనం భరతమాతకు అభివందనం అనే కార్యక్రమం హైదరాబాద్ లలిత కళాతోరణం లో విందుగా జరిగింది, వేలాది మంది చిన్నారులు జయ జయహే తెలంగాణ గీతానికి నృత్యాన్ని అందించారు అదేవిధంగా వందేమాతరానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అదేవిధంగా భారత స్వాతంత్రానికి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందేమాతరం అంటూ గీతాన్ని ఆలపిస్తూ చిన్నారులు తమదైన శైలిలో నృత్యాలు చేశారు దృశ్యాన్ని చూసిన సబికులు మంత్రముగ్ధులయ్యారు. వేలాది మంది ఒకే వేదికపై ఒకే టైంలో నృత్యం చేసినందుకుగాను ప్రముఖ సంస్థ ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో ఈ కార్యక్రమాన్ని రికార్డ్ కు ఎంపిక చేసింది. లలిత కళాతోరణం అధ్యంతం ప్రొద్దున నుండి సాయంత్రం వరకు ఒక కళా జాతరను తలపించింది. తమ చిన్నారులు వేదికపై నృత్యాలు చేస్తుంటే వారి తల్లిదండ్రుల సంతోషం అంతుపట్టలేదు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని చిన్నారులకు పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించారు చిన్నారులు వారి చిన్ని చిట్టి చేతులతో చాలా చక్కనైన బొమ్మలు గీశారు. సభ మొదటి సెషన్లో సంగీత గీతాలు దాదాపు 50 జాతీయ గీతాలను ఆలపించారు, మధ్యాహ్నం తర్వాత 40 జాతీయ గీతాలకు నృత్య ప్రదర్శనలు చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం పెట్టడం వల్ల చిన్నారులలో దేశం పట్ల రాష్ట్రం పట్ల భక్తి పెరుగుతుందని అన్నారు. రసమయి కళా సంస్థల అధినేత రాము మాట్లాడుతూ తెలంగాణ కళా జాగృతి అధినేత పద్మా వెంకటేష్ చేస్తున్న కృషిని కొనియాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు దరువు ఎల్లన్న మాట్లాడుతూ జయ జయహే తెలంగాణ పాడటం వల్ల రాష్ట్రానికి వందేమాతరం పాడడం వల్ల తెలంగాణ ఆంధ్ర చిన్నారులను ఏకం చేసి జాతీయ సమైక్యవాదాన్ని పెంపొందించినట్టుగా అనిపిస్తుంది అన్నారు. సలహా మండలి సభ్యులు దరువు అంజన్న మాట్లాడుతూ అందెశ్రీ అందించిన రాష్ట్రీయ గీతానికి నిజమైన నివాళి నేడు లభించిందని అది తెలంగాణ జాతికి గర్వకారణం అని అదేవిధంగా వందేమాతర గీతాన్ని 150 సంవత్సరాల పాటు కొనియాడుతూ నేడు వేలాది మంది నృత్యం చేయడం హార్శించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా సాంఘితిక కళానిలయం అనిత ప్రియదర్శిని చాలా చక్కనైన వ్యాఖ్యానాన్ని అందించారు. ఇంత గొప్ప కార్యాన్ని అందించిన సంగీతిక కళానిలయం మరియు తెలంగాణ కళాజాగృతి సంస్థ అధ్యక్షులు అనిత ప్రియదర్శిని మరియు పద్మ వెంకటేశులను అతిథులు ఘనంగా సత్కరించారు వీరికి సహకరించిన రాందాస్ గారిని సన్మానించారు. అదేవిధంగా ఎంతో కృషిచేసి చిన్నారులలో ఉన్నటువంటి కళను వెలికి తీసి వారి ప్రతిభను లలిత కళల తోరణం లో ప్రదర్శించేలా చేసిన సంగీత నృత్య గురువులను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు వారికి శాలువాలు మరియు జ్ఞాపికాను ఇచ్చి పొగడ్తలతో ముంచెత్తారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేలాదిమంది కళాకారులకు సంస్థ సర్టిఫికెట్లను అందజేసింది.

🌐 Select Language:
📰 ePaper