కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన తహరాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సదయ్య
జనం న్యూస్ ఆగస్టు 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాటం తిరుపతిరెడ్డి తన కుమారుడు రవీందర్ రెడ్డి కలిసి మండలం లోని తహరాపూర్ గ్రామ శివారులోని 107 సర్వే నంబర్ కొడిశలకుంట దగ్గర భూమిని క్రషర్ కొరకు 40 సంవత్సరాల క్రితం 60 వేల రూపాయలకు గుత్తాగా అందాద రెండు ఎకరాలు కొని పహానిలో ఎంత ఉంటే అంత మూడు ఎకరాలు అక్రమంగా దొంగ కాగితాలు సృష్టించి పట్టా చేసుకునీ కట్టను దారిని ఆక్రమించుకొని దళిత రైతులమైన మాకు దారి లేకుండా చేసిన విషయంపై హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్గ్రీవెన్స్ లో కాటం తిరుపతి రెడ్డి రవీందర్ రెడ్డి లపై చట్టపరమైన చర్యలు తీసుకొని దళితులమైన మాకు న్యాయ చేసి కట్టపై క్రషర్ ర్యాంపు నిర్మించి దారి లేకుండా చేసిన వారిపై దళిత రైతులమైన మా దారీ ఆక్రమించుకొని మమ్ములను దారి నుండి పోనీయకుండా చేస్తూ తిరుపతిరెడ్డి రవీందర్ రెడ్డి లు గతంలో సర్వే చేయిస్తే అప్పుడు వచ్చిన సర్వే యర్ ఎవరి భూమికి వారికి హద్దులు పాతి నక్ష గీసి వెళ్ళినారు కానీ మళ్లీ అక్రమంగా దొంగ కాగితాలు సృష్టించి తిరుపతి రెడ్డి రవీందర్ రెడ్డి మళ్లీ కావాలని సర్వే చేయించుకొని దారి కట్ట ను పోవాలని అమ్ముకొని పోవాలని చూస్తున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తహరాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రేణికుంట్ల సదయ్య కొమ్ముల మల్లయ్య దళిత రైతులు కోరుతూ వినతి పత్రం అందజేశారు…..