సూరేపల్లి తాడివారిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం. మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు. 18మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు సాగుచేయాలని తెలిపారు. ప్రస్తుతం ఎల్నినో కారణంగా బెట్ట ను తట్టుకునే కంది, ఆముదం, నువ్వులు,ఉలవ పంటలు తక్కువ నీటితో పండించి, కొంతవరకు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. రైతులు విత్తన గుళికలు తయారు చేసుకుని,పొలంలో చల్లిన 30-40 రోజుల లోపు ఎప్పుడు వర్షం పడినా, విత్తనాలు మొలకెత్తడానికి ఘన జీవామృతం, పుట్టమన్ను, బూడిద, ఆవుపంచగం దోహదపడతాయని తెలిపారు.నీటి వసతి ఉన్న రైతులు డ్రిప్ లేదా తుంపర్ల సేద్య విధానాలు పాటించాలి అని తెలిపారు. తాడివారిపల్లె గ్రామంలో సాగుచేసిన సజ్జ, డ్రిప్ పద్ధతి లో సాగుచేస్తున్న ఆముదం పొలాలను రైతులతో కలిసి సందర్శించారు. యూరియా, డి ఎ పి ఎరువులు రైతు సేవ కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో వి ఏ ఏ లు వెంకటేశ్వర రెడ్డి, జిలానీ,ఏపీసీన్ఫ్ సిబ్బంది మేరీమణి, కరుణబాబు, రైతులు పాల్గొన్నారు.