విగ్రహం తొలగింపు ఉద్యమకారుల అరెస్టులు
జనం న్యూస్ ఆగస్టు 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం అక్రమ తొలగింపుతో తెలంగాణ ఉద్యమకారుల గొంతు నొక్కేలా ప్రభుత్వం వ్యవహరించడం ప్రజాస్వామ్య స్త్పూరికి విరుద్ధమని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఉద్యమ కారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన విగ్రహాన్ని భారీగా పోలీసు బలగాలను మోహరించి తొలగించడాన్ని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన్ చారి విమర్శించారు అరెస్టులు చేసిన తెలంగాణ ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.పార్టీ కార్యాలయానికి వెళ్లనీయకుండా అడుగడుగునా పోలీసుల అడ్డంకులుపార్టీ నాయకులను కనీసం పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లనీయకుండా అడుగడుగునా పోలీసుల అడ్డంకులు. వెస్తున్నారుఇది పోలీస్ రాజ్యమా ప్రజాస్వామ్యమా అని అన్నారు.ఈ అరెస్ట్ లో బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తల్లి దివ్యాంగుల సేవాసమితి అధ్యక్షులు గజ్జి శంకర్ తదితరులు ఉన్నారు….