వైఎస్ జగన్ తో పినిపే శ్రీకాంత్ భేటీ

August 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త పినిపే శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అమలాపురం నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వచ్చేది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కేసులు నమోదైన వారి వివరాలను జగన్ మోహన్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper