కామారెడ్డి DEO ఆకస్మిక పర్యటనలు
బిచ్కుంద, ఆగస్టు 18 ( జనం న్యూస్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలో విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ KGBV పాఠశాల మరియు గణేష్ మందిర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా పర్యటించారు.ముందుగా KGBV పాఠశాలను సందర్శించి తరగతులను పరిశీలించారు.అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని వండుతున్న తీరును పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ప్రిన్సిపల్‌కు సూచించారు.గణేష్ మందిర్ ప్రాథమికపాఠశాలను సందర్శించి పరిసరాలను పరిశీలించారు.1, 2 తరగతుల విద్యార్థులకు స్వయంగా పాఠం చెప్పారు.విద్యార్థుల పాఠం చదవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.పాఠశాల కిటికీలు ఎందుకు మూసి ఉంచుతున్నారు అని అడిగారు. “కిటికీ తెరిస్తే దుర్గంధం వస్తుందని” టీచర్లు చెప్పడంతో, MEO ఆనంద్ ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం బిచ్కుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కూడా సందర్శించారు.