బిజెపి జాతీయ ఉపాధ్యక్షులుగా జాతి నాయకుడు రామ్ మాధవ్ -వీరన్న చౌదరి హర్షం

August 18, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా కోనసీమ ముద్దుబిడ్డ, జాతి నాయకుడు రామ్ మాధవ్ నియమితులు కావడం పట్ల రాజానగరం భారతీయ జనతా పార్టీ మాజీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి హర్షం వ్యక్తం చేశారు.చిన్నతనం నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో క్రమశిక్షణతో ఎదిగిన రామ్ మాధవ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఆయన అనుభవం, నాయకత్వం భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని కొనియాడారు. కోనసీమ నుండి జాతీయ స్థాయికి చేరుకున్న రామ్ మాధవ్ నియామకం తెలుగు ప్రజలకు, ముఖ్యంగా కోనసీమ వాసులకు గర్వకారణమని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగ పడుతుందని వీరన్న చౌదరి పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper