నా హృదయపూర్వక ధన్యవాదాలు డివై జే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తానగుల జితేంద్ర రావు కు, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్
జనం న్యూస్ 19-08-2026 నాపై నమ్మకం ఉంచి, ఈ యూనియన్ను ముందుకు తీసుకెళ్లి, యూనియన్ పేరును మరింత ప్రఖ్యాతి పొందేలా చేయగలననే ఆలోచనతో నాకు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవిని అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.అలాగే, YJF యూనియన్ ఛాంబర్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు కి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యూనియన్‌కు పునాది వేసి, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రతి సౌకర్యాన్ని అందించేందుకు బాధ్యత తీసుకున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, యూనియన్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. యూనియన్ పేరును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాను.మీ నమ్మకానికి, ఆశీస్సులకు హృదయపూర్వక ధన్యవాదాలు.