Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 18: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పుట్టినరోజు కాకముందే ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు కాంగ్రెస్ పార్టీకి షాడో లీడర్లగా తయారైన జిహెచ్ఎంసి అధికారులు ఇన్ని రోజులుగా రోడ్లపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఎందుకు తీయలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక న్యాయమా కాంగ్రెస్ పార్టీ,అధికారుల ద్వంద వైఖరిని ప్రజలు చూస్తున్నారు
ఇకపైన ఏ పార్టీవారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అధికారులు స్పందించాలి లేకపోతే ఊరుకోం కూకట్ పల్లి కార్పొరేటర్లు తెలంగాణ రాష్ట్రం సాధించిన పది సంవత్సరాలలో కేసీఆర్ పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన 14 నెలల కాలంలో దుర్మార్గమైన పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రస్టు పట్టిస్తున్నారని కూకట్ పల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలను,బ్యానర్లను ఏర్పాటు చేస్తే దానిపై కూడా రేవంత్ రెడ్డి సర్కార్ రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. గత 14 నెలలలో ఏ గల్లీలో చూసిన ఏ రోడ్డులో చూసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు కానీ జిహెచ్ఎంసి అధికారులు వాటిని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఎన్ని రోజులుగాలేని నిబంధనలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజులకి వర్తిస్తాయని అధికారులను కార్పొరేటర్లు ప్రశ్నించారు. కార్పొరేటర్లుగా ప్రజా సమస్యలను జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవట్లేదు కానీ ప్రజా ప్రతినిధిల పుట్టినరోజు జరగకముందే ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు న్యాయమో జిహెచ్ఎంసి అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇకనుండి ఏ పార్టీ వారైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన అదేవిధంగా చర్యలు తీసుకోవాలి కానీ కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ఒక న్యాయం బిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయమంటే బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు , కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వింత ప్రవర్తనతో బిఆర్ఎస్ నాయకులను ఇబ్బందులు పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ అధికారులు చూస్తున్నారు కానీ రాబోయేది కెసిఆర్ ప్రభుత్వమేనని అప్పుడు అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వడ్డీతో సహా ఖచ్చితంగా చెల్లిస్తామని కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు,సతీష్ గౌడ్,ఆవుల రవీందర్ రెడ్డి, సభిహ గౌసుద్దిన్,మాజీ కార్పొరేటర్ బాబురావు పాల్గొన్నారు.