ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు
జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని కాట్రేనికోన మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పల్లంకుర్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ రంగానికి చెందిన అసోసియేషన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు, ఫోటోగ్రఫీ రంగానికి విశిష్ట సేవలు అందించిన లూయస్ జాకస్ మండే డాగురె చిత్రపటానికి అసోసియేషన్ అధ్యక్షులు కోలాటి సత్యం మరియు కాశి మూర్తి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సంసాని అర్జున్, రచ్చ కాసులు, రఘురాం, ఎం రామారావు, రమేష్, పి రాంబాబు, రాజ్, ఓంకార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.