భీమ్ ఆర్మీ( భారత్ ఏక్తా మిషన్) జహీరాబాద్ పట్టణ నూతన కమిటీ నియామకం*

August 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జహీరాబాద్ తేదీ 19-08-2026 భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారి మరియు జాతీయ అధ్యక్షులు వినయ్ రతన్ సింగ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రావణ్ గారి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో నూతన కమిటీ నియామకం జరిగింది . వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని జ్యోతి రావు పూలే గారి జీవిత విధానమే ఆదర్శంగా తీసుకుని భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) అడుగులు వేస్తుందని సిద్దు రావణ్ గారు అన్నారు బహుజన రాజ్యమే లక్ష్యంగా మాట్లాడుతూ యువతను కదిలిస్తే బహుజన రాజ్యం వైపే ఓట్లు మన సీట్లు అని యువతను ప్రశంసించారు ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడం పాపమైందని బానిసలం కాదు మనం పాలకుల మౌదామని ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ అధ్యక్షుడిగా మహమ్మద్ అలీమ్ హుస్సేన్ గారిని నియమించారు. మరియు భీమ్ ఆర్మీ నాయకులు బాలరాజు, జైపాల్, రాహుల్, సిద్ధార్థ్ , రవీందర్ రాంచందర్ , మమ్మద్ ఫరూక్ మహమ్మద్ సద్దాం హుస్సేన్ మహమ్మద్ షఫీ హుస్సేన్ , మహమ్మద్ జమీల్ అబ్దుల్ గఫర్, మమ్మద్ మజార్ మహ్మద్ రాయిస్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper