మొరం టిప్పర్ల రవాణాతో ధ్వంసమైన సీసీ రోడ్డురోడ్డును ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం

August 19, 2026 | వైరల్ వార్తలు

బిచ్కుంద ఆగస్టు 19 : జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని దాస హనుమాన్ మందిరానికి వెళ్లే ప్రధాన రోడ్డు మొరం టిప్పర్ల రాకపోకలతో పూర్తిగా ధ్వంస మైంది. టిప్పర్లతో రోడ్డు ధ్వంసం:పోలీస్ స్టేషన్ పక్కనుంచి మందిరానికి వెళ్లే ఈ సీసీ రోడ్డుపై రోజూ పెద్ద పెద్ద మొరం టిప్పర్లు తిరుగుతున్నాయి. దీంతో రోడ్డు పూర్తిగా పాడై గుంతలమయంగా మారింది.స్థానికుల ఆవేదన:రోడ్డు ఇంతలా దెబ్బతిన్నా సంబంధిత కౌన్సిలర్, చైర్మన్, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోపక్క మొరం కొనసాగిస్తున్న వారు సైతం ధ్వంసమైన రోడ్డుపై మొరం కూడా వేయడం లేదని వారు ఆరోపించారు.మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి:తమకు వెళ్లడానికి ఉన్న ఏకైక ప్రధాన రోడ్డు ఇదేనని, వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టి బాగు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు త్వరగా బాగు చేయకపోతే ఆందోళనలు చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper