బిజెపి నూతన జాతీయ కమిటీలో ఏపి నేతలకు చోటు – కరెడ్ల దేవి హర్షం
జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రకటించిన నూతన జాతీయ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపికైన రామ్ మాధవ్, ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్ గా నియమితులైన విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురందేశ్వరికి ఆల్ ఇండియా సైకాలజిస్ట్ గ్రూప్ సభ్యురాలు, బిజెపి నాయకురాలు, నేషనల్ కాపు జెఎసి విమెన్ అధ్యక్షురాలు కరెడ్ల దేవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపికైన రామ్ మాధవ్ కు ఫోన్ ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.వారి అనుభవం, అంకితభావంతో బిజెపిని మరింత బలోపేతం చేస్తూ దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వీరి నియామకాలు కీలకంగా ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని మరింత పటిష్టపరచడంలో వారు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ శుభాకాంక్షలు తెలిపారు.వికసిత భారత్ లక్ష్య సాధనలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో నూతన కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. రాష్ట్రంలో బిజెపికి మంచి భవిష్యత్తు ఉందని, యువత, మహిళల భాగస్వామ్యంతో పార్టీ మరింత బలపడుతుందని కరెడ్ల దేవి ధీమా వ్యక్తం చేశారు.