మాజీ ఏజీపీ షేక్ మహమ్మద్ అలీ సతీమణికి ₹70,000 సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలానికి చెందిన మాజీ ఏజీపీ షేక్ మహమ్మద్ అలీ సతీమణి ఖమీస్ భానుకి ఇటీవల జరిగిన శస్త్రచికిత్స నిమిత్తం మంజూరైన ₹70,000 విలువైన ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్పెషల్ ఇన్వైటీవ్ ఎగ్జి క్యూటివ్ మెంబర్, రాజంపేట పార్ల మెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ స్వయంగా స్వగృహ ముకు వెళ్లి అంద జేశారు.ఈ సందర్భంగా మాజీ ఏజీపీ షేక్ మహమ్మద్ అలీ ఆనందం వ్యక్తం చేస్తూ, సాయి లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారి గౌరవార్థం తేనీటి విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్, తోట రామయ్య, రాచూరి మురళి, వీరబల్లి జయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.