స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం.ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై ఎంపీపీ సమీక్ష

August 25, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 25-08-26నందలూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నందలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యం లో ఎన్నికల ఏర్పాట్లపై అధి కారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాల సవరణలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై మండల ఉన్నతాధి కారులతో చర్చించారు.మండలఉన్నతాధికారి ప్రసాద్ మాట్లాడు తూ ఎన్నికల కమిషన్ నిబంధ నలకు అనుగుణంగా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ హించేందుకు మండల, గ్రామ పంచాయతీ స్థాయి అధికారులు సిద్ధంగా ఉన్నారని ఎంపీపీకి వివ రించారు.త్వరలో అన్ని రాజ కీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలను అందజేస్తామని తెలిపారు.ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం సరిచేస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మండల కోఆప్షన్ సభ్యుడు కలీముల్లా ఖాన్, వైస్ ఎంపీపీ అనుదీప్, ఎంపీటీసీ పొత్తపి చంద్ర, పాటూరు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, నల్లతిమ్మాయపల్లె మాజీ సర్పంచ్ గీతాల నర సింహారెడ్డి,పల్లె గ్రీష్మంత్ రెడ్డి, ముమ్మడిశెట్టి సుధాకర్, అరిగె నాని, నాగసుబ్బయ్య, సోమిశెట్టి ప్రభాకర్, బద్ది రెడ్డి, విజయుడు, నాగభూషణం, సాయి కృష్ణ తదితర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper