5.రాజు కుటుంబానికి రూ.4 వేల ఆర్థిక సాయం అందజేసిన బీసీ కాలనీ పాఠశాల సిబ్బంది

August 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగష్టు 25 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన వడ్లకొండ రాజు కుటుంబానికి ఎంపీపీఎస్ ఎల్కతుర్తి బీసీ కాలనీ పాఠశాల సిబ్బంది ఆర్థిక సాయం అందజేశారు.వడ్లకొండ రాజు కుమారుడు వడ్లకొండ శివకేశవ ఎల్కతుర్తి బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. తండ్రి ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది స్పందించి, ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.4 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆర్థిక సాయం అందజేసిన వారిలో పాఠశాల సిబ్బంది ఆర్. విజయ, సరేష్మ, రమాదేవి, రాజేశ్వరరావు, ప్రేమలత, రమక్క, కళ, దివ్య, సంధ్య తదితరులు ఉన్నారు.బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన పాఠశాల సిబ్బందిని స్థానికులు అభినందిస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper