జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సెయింట్ జోసఫ్ పాఠశాల విద్యార్థుల ఎంపిక

August 25, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్-ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ స్థానిక సెయింట్ జోసఫ్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ లలిత తెలిపిన వివరాల ప్రకారం.. పీఈటీ రమేష్ శిక్షణలో తర్ఫీదు పొందిన పదో తరగతి విద్యార్థులు వెంకట సాయి, ముజీబ్‌లు తమ ప్రతిభతో జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు.నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో జరిగే జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో లాంగ్ జంప్, షాట్‌పుట్ విభాగాల్లో నల్గొండ జిల్లా తరఫున ఈ విద్యార్థులు ప్రాతినిధ్యం వహించనున్నారు.జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ జోస్పిన్ , ప్రిన్సిపాల్ సిస్టర్ లలిత, ఉపాధ్యాయులు అభినందించి, పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

🌐 Select Language:
📰 ePaper