చెట్టును నాటుదాం – భావితరాలకు పచ్చని భవిష్యత్తును కానుకగా ఇద్దాం-ఎఫ్ డి ఓ సంగీత

August 25, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ -ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సంగీత ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి ఒక్కరూ మొక్కను సంరక్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నాటిన మొక్కల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రణాళికాబద్ధంగా జియో ట్యాగింగ్ చేపడుతున్నట్లుగా తెలిపారు. బిసి స్కూల్ ప్రిన్సిపాల్ రవికుమార్ మాట్లాడుతూ ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం చెట్లు అని ఈరోజు మనం నాటే ప్రతి చిన్న మొక్క రేపు ఒక మహా వృక్షమై ఎంతోమందికి ఊపిరినిస్తుందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ మాట్లాడుతూ చెట్టును మనం రక్షిస్తే ఆ చెట్టు మనల్ని రక్షిస్తుందని ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలోఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రవీందర్ రెడ్డి, రాములు, సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా ప్రసాద్, మరియు కౌన్సిలర్లు, ఫారెస్ట్, పోలీస్ సిబ్బంది, గురుకుల పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper