అమలాపురంలో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం

August 25, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగస్టు 25 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం పట్టణంలోని పాత పోలీస్ క్వార్టర్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయాన్ని గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు, అమలాపురం శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు, ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించడానికి, పోలీసు సేవల పరిధిని విస్తరించడానికి నూతన డీఎస్పీ కార్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల రక్షణకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు ఎస్ ఆర్ కె ప్రసాద్ సీఐలతో పాటు కూటమి నాయకులు పెచ్చేట్టి చంద్రమౌళి, మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper