ఎంపీమేడారఘునాథ్‌రెడ్డి నిధులు తో బాలికల భద్రత సోలా పెన్సింగ్ ఏర్పాటు.

August 26, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజీలో బాలికల హాస్టల్‌ భద్రతతో పాటు కోతుల బెడద నివారణకు సుమారు రూ.6 లక్షల వ్యయంతో సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌రెడ్డి తన నిధుల నుంచి నిధులు మంజూరు చేసినట్లు మండల పరిషత్‌ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు.మంగళవారం ఎంపీపీ మేడావిజయభాస్కర్‌రెడ్డి, మండల అభివృద్ధి అధికారికెఆర్ఎంప్రసాద్‌ ,ఆధ్వ.ర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్.స్కూల్‌ను పర్య వేక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం గతంలో బాలికల హాస్టల్‌ భద్రత, కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా,స్పందించిన ఆయనసొంతనిధులతో సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారని ఎంపీపీ తెలిపారు.మధ్యాహ్నభోజనంపై ఆరాడొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును ఎంపీపీ, మండల అభివృద్ధి అధికారిపరిశీలించారు.మెనూప్రకారంవిద్యార్థులకు 140 గ్రాముల చికెన్‌ అందించాల్సి ఉండగా, 70 గ్రాములు మాత్రమే ఎందుకు అందిస్తున్నారని ప్రిన్సిపాల్‌ రామకృష్ణారెడ్డిని ఎంపీపీ ప్రశ్నించారు. చికెన్‌ ధరలు గణనీయంగాపెరగడం,కొంతమందివిద్యార్థినులువెజిటేరియన్లు కావడం వల్ల ఈపరిస్థితి ఏర్పడిందని ప్రిన్సిపాల్‌ వివరించారు.ఈ సందర్భంగా మేడా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌ అభివృద్ధికి తమ వంతు సహకారంతో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామనితెలిపారు.విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, భద్రతకు సంబం ధించి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని, సమస్యలకు శాశ్వత పరిష్కారంచూపేందుకు ఎల్లవేళలాఅందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్‌ సభ్యులు కలీముల్లా ఖాన్‌, వైస్‌ ఎంపీపీ అనుదీప్‌, ఎంపీటీసీ పొత్తపి చంద్ర, పాటూరుమాజీసర్పంచ్‌ .
మోహన్‌రెడ్డి, నల్లతిమ్మాయపల్లె మాజీ సర్పంచ్‌ గీతాల నరసింహా రెడ్డి,పల్లెగ్రీష్మంత్‌రెడ్డి, ముమ్మడి శెట్టిసుధాకర్‌, బద్దిరెడ్డి, నాగభూషణం, సాయికృష్ణ తదితర వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper