పెందోట సాహిత్య పురస్కారాల్లో గడ్డం బాలకిషన్‌కు ఘన సన్మానం.

August 26, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ;26 ఆగస్టు బుధవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ ; శ్రీ వాణి సాహిత్య పరిషత్ 12వ వార్షికోత్సవం, పెందోట సాహిత్య పురస్కారాలు, కవి సమ్మేళనం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి ఆచార్య మట్ట సంపత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాహిత్య పురస్కారాలు కవులకు ప్రోత్సాహమని అన్నారు.ఈ సందర్భంగా పెందోట వెంకటేశ్వర్లు రచించిన “ప్రేరణ కావాలి” పుస్తకాన్ని ఆవిష్కరించారు. “ఐచ్చికం” అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనంలో గడ్డం బాలకిషన్‌తో పాటు పలువురు కవులు కవితలు వినిపించారు. అనంతరం గడ్డం బాలకిషన్‌ను శాలువా, పుస్తకంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కవులు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper